ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ

11-09-2026 | 12:28am

ముకరంపుర,(విజయక్రాంతి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని అన్ని డివిజన్ల ప్రజలకు ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను అందజేస్తున్నట్లు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(Mayor Kolagani Srinivas) తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ(Environmental protection)ను ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తూ, ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నగరంలోని మొత్తం 66 డివిజన్ల ప్రజలకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే సుమారు 15,000 మట్టి గణపతి ప్రతిమలను తెప్పించినట్లు వెల్లడించారు. ఒక్కో డివిజన్‌కు సుమారు 250 చొప్పున విగ్రహాలను కేటాయించి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు