ప్రముఖ వ్యాపార వేత ఆత్మహత్య

10-09-2026 | 11:46pm

పటాన్ చెరు: ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, హోమ్ ల్యాండ్ సంస్థ అధినేత బాణాల రామ్‌రెడ్డి ఆత్మహత్య(commits suicide)కు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) కందుకూరు మండలం నేదునూరు గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో ఆయన ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. రామ్‌రెడ్డి హైదరాబాద్‌లోని మణికొండలో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం(Real estate business) నిర్వహిస్తున్నారు. 2018లో పటాన్‌చెరువు ప్రాంతంలో సుమారు 250 ఎకరాల భూమిని డెవలప్‌మెంట్ కోసం తీసుకుని ఒక భారీ వెంచర్ చేపట్టారు. అయితే ఆ భూమికి సంబంధించిన కోర్టు వివాదాలు, లిటిగేషన్ల కారణంగా వెంచర్ అభివృద్ధి బాగా ఆలస్యమైంది.

ఈ వివాదాలను పరిష్కరించేందుకు ఆయన భారీగా అప్పులు చేసినట్లు సమాచారం. ఒకవైపు అప్పుల భారం పెరగడం, మరోవైపు భూ యజమానులతో కూడా సమస్యలు తలెత్తడంతో తీవ్ర మనస్తాపానికి, మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకుల ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు