భూగర్భ జలాల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..
ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
బెజ్జూర్ అక్టోబర్ 29 (విజయ క్రాంతి): బెజ్జూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో(Farmers' Platform) గ్రామ మహిళా సంఘాల(Village women's groups) అధ్యక్షులు, గ్రామపంచాయతీ(Village Panchayat) కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటికో ఇంకుడు గుంత, రైతుకు పంట కుంట, ఊరికి ఊట కుంట ఏర్పాటు చేసుకోవడం తో పాటు బోర్ వెల్ రీఛార్జ్ నిర్మాణం చేస్తూ నీటిని పొదుపుగా వినియోగించుకోవచ్చన్నారు.
తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వ్యవసాయ అధికారి నాగరాజు మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న 38 రకాల వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై పొందాలని తెలిపారు. పశువైద్యాధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..
పశుగ్రాసం సాగుకు ఎకరాకు రూ.14 వేల సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విబిజి రాంజీ పథకంలో భాగంగా కోళ్ల పెంపకం, పశువుల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందించే పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎడీసీసీ బ్యాంకు మేనేజర్ రాజేందర్ మాట్లాడుతూ.. కొత్త మహిళా సంఘాలకు రుణాలు అందిస్తామని తెలిపారు.
తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపిఎం మోహన్ దాస్ మాట్లాడుతూ. మన సంగంలో వచ్చే లోన్స్ తిరిగి కిస్తీ రూపంలో కట్టాలి కానీ ఈ వ్యవసాయ పని ముట్లు ప్రభుత్వం 50% సబ్సిడీ మహిళలకి ఇస్తుంది కాబట్టి మళ్ళీ కట్టేది ఉండదు. కాబట్టి ఇదీ అందరు వినియోగించు కోవాలని కోరారు.ఇందులో సీసీలు రంగయ్య, భద్రయ్య, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.