ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
02-10-2026 | 04:23pm
చేగుంట , అక్టోబర్ 2, విజయక్రాంతి: చేగుంట మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను వివిధ గ్రామాలలో సర్పంచ్, పాలకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ చేసిన సేవలను ఈ సందర్బంగా వారు గుర్తు చేసుకున్నారు.