ఏదిరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్

25-09-2026 | 07:11pm

వెంకటాపురం, నూగూరు సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : వెంకటాపురం మండలం(Venkatapuram Mandal) పరిధిలో ఏదిరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre) లో జిల్లా అధికారులు వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్ రావు  ఆదేశాల మేరకుశుక్రవారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సబ్ సెంటర్(Ayushman Arogya Mandir Sub-Centre) గ్రామాలలో హెల్త్ క్యాంప్(Health Camp) నిర్వహించడం జరిగింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ తిప్పాపురం గ్రామపంచాయతీ సర్పంచ్  ఆధ్వర్యంలో ఎంపీఓ బొక్కం నారాయణ పర్యవేక్షణలో పెంకువాగు గ్రామంలో హెల్త్ క్యాంపులో గర్భవతులు(Pregnant women), గ్రామస్తులను పరీక్షలు నిర్వహించడం జరిగింది.

గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స అందించి 29మందికి వైద్య  పరీక్షలు చేశారు. జ్వరం లక్షణాలతో బాధపడుతున్న వారికి ఒకరికి మలేరియా నిర్ధారణ పరీక్షలు ఆర్ డి టి నిర్ధారణలో రాలేదు. గ్రామస్తులకు జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావాలని  వ్యక్తిగత పరిశుభ్రత చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి పరిసరాలలో నీరు నిలవ ఉండకుండా చూసుకోవాలని సబ్బుతో చేతులు కడుక్కుందాం అని అవగాహన కల్పించారు.

జబ్బులకు దూరంగా ఉందాం ఈనెల 24 నుండి అక్టోబర్ 1 వరకు వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. రక్త పోటు వంటి ఇతరత్రా ఆరోగ్య సమస్యల గురించి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిప్పాపురం గ్రామపంచాయతీ సర్పంచ్  చందా శిరీష సిబ్బంది   వైద్య సిబ్బంది, హెచ్ ఈ ఓ కోటిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్. మోహన్ కృష్ణ, ఆశా కార్యకర్తలు నాగమణి, శిరీష, సమ్మక్క గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు