కొత్తపేటలో కొండా లక్ష్మణ్ భారీ విగ్రహం
కరపత్రాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నాగోల్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): కొత్తపేట కూడలిలో త్వరలో ప్రతిష్ఠించనున్న తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 33 అడుగుల భారీ కాంస్య విగ్రహానికి సంబంధించిన కరపత్రాన్ని గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) సచివాలయంలో ఆవిష్కరించారు. ఎల్బీనగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో పద్మశాలి నాయకులు, ట్రస్ట్ సభ్యులు సీఎంను కలిశారు. విగ్రహావిష్కరణను తన చేతుల మీదుగా నిర్వహించేందుకు సీఎం అంగీకరించినట్లు తెలిపారు.
ఈ కార్య క్రమంలో అఖిల భారత పద్మశాలి అధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్థపు మురళి, తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, కుడా చైర్మన్ గుండు సుధారాణి ప్రభాకర్, క్రియేటివ్ డైరెక్టర్ కొండ రాజు, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కుమార్, పద్మశ్రీ గజం అంజయ్య, చాగండ్ల నరేంద్రనాథ్, పుట్ట పాండురంగయ్య, మహి ళా నాయకులు ఉరకొండ రమాదేవి, ట్రస్ట్ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, తెలంగాణ, అఖిల భారత పద్మశాలీ నాయకులు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.