వినియోగంలోకి మరో విద్యుత్తు సబ్ స్టేషన్
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district) కేసముద్రం మండలంలో మరో విద్యుత్ సబ్స్టేషన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. హెచ్చుతగ్గులు లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి కొత్తగా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో టీజీ ఎన్ పీడీసీఎల్ 3.50 కోట్లతో ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ను మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తో కలిసి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.
ఇప్పటికే కేసముద్రం మండలంలో రంగాపురం, తాళ్లపూస పల్లి, ధనసరి, కేసముద్రం, మహమూద్ పట్నం, కల్వలలో విద్యుత్ సబ్ స్టేషన్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఉప్పరపల్లి సబ్ స్టేషన్ వినియోగంలోకి వచ్చింది. దీనితో కేసముద్రం మండలంలో విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
మెరుగైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ హెచ్ ఆర్ డి డైరెక్టర్ సీ.ప్రభాకర్, సీ ఈ ఆపరేషన్ అశోక్ కుమార్, జిఎం ఆపరేషన్ విజేందర్ రెడ్డి, ఎస్ ఈ ఆపరేషన్ కే.దర్శన్ కుమార్, డి ఈ టెక్నికల్ కె.హిరాలాల్, డి ఈ ఆపరేషన్ కోటేశ్వరరావు, డి ఈ కన్స్ట్రక్షన్ సునీత దేవి, ఏడిఈ ఆపరేషన్ రాములు నాయక్, ఏడీఈ కన్స్ట్రక్షన్ ఐలయ్య, ఏడిఈ ప్రొటెక్షన్ లోకనాథ్ రెడ్డి, ఏ ఈ లు ప్రసాద్, కే.రాజు, రమణ, ఎస్.క్రాంతి కుమార్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.