ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా అలై బలై
జడ్చర్ల, అక్టోబర్ 23: తెలంగాణ సంస్కృతి(Culture of Telangana), సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అలై బలై కార్యక్రమాన్ని జడ్చర్ల పట్టణంలోని చందర్ గార్డెన్స్‌లో ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆత్మీయ మిత్రమండలి అధ్యక్షులు బాదిమి శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మిత్రమండలి సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా సభ్యులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ, స్నేహభావంతో కలిసి పండుగ వాతావరణంలో అలై బలై కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకున్నారు. అలై బలై వంటి కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించడంతో పాటు ప్రజల మధ్య స్నేహం, ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్మాస్టర్ శంకర్ రెడ్డి, అలంపల్లి మనోహర్, డాక్టర్ రాంరెడ్డి, నర్సింలు, విశ్వనాథం, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. మిత్రమండలి సభ్యులు, స్నేహితులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.