కాంగ్రెస్ సభలతో విపక్షాల్లో గుబులు

27-11-2026 | 04:10pm

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బహిరంగ సభలకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Adi Srinivas) అన్నారు. కాంగ్రెస్ సభల విజయంతో బీఆర్ఎస్‌(BRS)లో వణుకు మొదలైందని, బీజేపీ కూడా ఆందోళన చెందుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలకు రాజకీయంగా స్థానం లేదని ఆయన విమర్శించారు. కేటీఆర్(KTR) నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడం లేదన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఐదు లక్షల పెన్షన్లు, ఎనిమిది లక్షల ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) అందించిందని ఆది శ్రీనివాస్ తెలిపారు. మహిళల ఆత్మగౌరవం కోసం 8 వేల భవనాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి బలమని ఆయన వెల్లడించారు.


మరిన్ని వార్తలు