సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జంగం రవి

22-10-2026 | 09:47pm

దసరా పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నాయకుడు

చిన్నచింతకుంట (ఆక్టోబర్ 22): మండల పరిధిలోని బండ్లవల్లి గ్రామానికి చెందిన బీజేహెచ్‌పీఎస్ నాయకుడు(BJHPS leader) సిరివాటి జంగం రవి, కొడంగల్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రికి ఆయన శాలువా కప్పి, ఆత్మీయంగా కరచాలనం చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జంగం రవి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో పాలమూరు ప్రాంతంతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ మరింత పురోగతి సాధించాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆయనకు దసరా శుభాకాంక్షలు తెలిపి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు