5 September, 2026 | 7:52 PM

అప్పంపల్లిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

05-09-2026 | 06:27pm

కౌకుంట్ల: అప్పంపల్లి, సెప్టెంబర్5 : దేవరకద్ర నియోజకవర్గ(Devarakadra Constituency) పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) ఆదేశాల మేరకు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు.

కార్యక్రమంలో యాదవ రెడ్డికి రూ.21,500, మండ్ల నరేష్‌కు రూ.22,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అప్పంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

మరిన్ని వార్తలు