కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
రాజాపూర్: కాంగ్రెస్ పార్టీ(Congress Party)తోనే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ నాయక్, సుజయ్ చంద్ర రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కుచ్చర్ కల్, తిరుమలాపూర్, కుతినేపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల(Congress Village Committees)ను ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి యూత్ కాంగ్రెస్ విభాగాలను ఏర్పాటు చేసి నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక అని పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడు చేయని విధంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు అందిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ చైర్మన్ యాదయ్య సత్యనారాయణ గౌడ్ , రాజు నాయక్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.