బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
ముకరంపుర,(విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) సమర్థవంతమైన నాయకత్వాన్ని బలపరుస్తూ, బిజెపి కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో స్థానిక బిజెపి(BJP) నాయకులు, కార్యకర్తలతో కలిసి కిసాన్ నగర్ గాంధీ విగ్రహం నుండి చింతల వరకు భారీ బైక్ ర్యాలీ(BJP Rally) నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ దేశం, ధర్మం, సమాజ శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేస్తుందని తెలిపారు.
ఒకవైపు బిఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు కుట్రలు, కుతంత్రాలతో బిజెపిపై లేనిపోని అవాకులు చేవాకులు పేలుస్తూ, తప్పుడు నినాదాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, కిసాన్ నగర్ ప్రజల గుండెల్లో బండి సంజయ్(Bandi Sanjay) స్థానం పదిలంగా ఉంటుందని, ప్రజల మద్దతు ఎల్లప్పుడూ బిజెపికే ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ...గత ఐదేళ్లుగా ఎంపీగా, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి అమృత్ 1, అమృత్ 2, స్మార్ట్ సిటీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా వందలాది కోట్ల రూపాయల నిధులను కరీంనగర్‌కు తీసుకువచ్చారని తెలిపారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధిని చూసే నగర ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి 34 స్థానాలు కట్టబెట్టి మేయర్ పీఠాన్ని అందించారని పేర్కొన్నారు.కిసాన్ నగర్‌లో రూ.65 కోట్లతో అభివృద్ధి చేశామని ప్రగల్భాలు పలుకుతున్న ఎమ్మెల్యే, అక్కడ వేసిన రోడ్లు, ఏర్పాటు చేసిన వీధి దీపాలు, ఇతర మౌలిక వసతులన్నీ కేంద్ర మంత్రి బండి సంజయ్ స్మార్ట్ సిటీ కింద తెచ్చిన నిధులతోనే పూర్తయ్యాయని తెలుసుకోవాలని పునరుద్గాటించారు.
ఈరోజు అసెంబ్లీలో కమలాకర్ కు పేరు వచ్చింది అంటే అవినీతిపై విచారణ జరపాలి అని పేరు వచ్చిందే కానీ అభివృద్ధి విషయంలో రాలేదని అన్నారు. మీ హయాంలో జరిగిన ఐటీ టవర్ ఏమైంది ఎక్కడ ఎన్ని లక్షల ఉద్యోగులు వచ్చినాయి మరియు మానే రివర్ ఫ్రంట్ తో ఎలక్షన్ లొ హామీలిస్తే ఎవరికి లాభం జరిగింది కేబుల్ బ్రిడ్జితో ఎవరు లాభం పొందారో ప్రజలు బేరీజు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కిసాన్ నగర్ బిజెపి నాయకులు, కిసాన్ నగర్ నుంచి పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.