పేదల సొంతింటి కలకు సర్కారు భరోసా

08-10-2026 | 11:39pm

గరిడేపల్లి,(విజయక్రాంతి): పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ చాంద్ మియా అన్నారు. గురువారం గరిడేపల్లి మండలం(Garidepalli Mandal) కీతవారిగూడెంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్(Indiramma Houses Proceedings) కాపీలను 33 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షేక్ చాంద్ మియా మాట్లాడుతూ.. రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సహకారంతో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కీతవారిగూడెం గ్రామంలో మొత్తం 70 కుటుంబాలకు ఇళ్లు మంజూరయ్యాయని, తొలివిడతగా 33 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేసినట్లు చెప్పారు. మిగిలిన 37 కుటుంబాలకు త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పేదల సంక్షేమం, గ్రామాభివృద్ధి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జానకమ్మ, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కీత సోమయ్య, ఉపసర్పంచ్ చిత్తలూరు వీరస్వామి, వార్డు సభ్యులు బండారు సైదులు, బండారు అంజయ్య, గుండు అజయ్, సఫియా మీరా, గూడెపు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, మేళ్లచెరువు రామ్మూర్తి, బొల్లెపల్లి సైదులు, బండారు హుస్సేన్, కాశిమ్, జానీ, కీత అంజయ్య, కడప అంజయ్య, చిన్న హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు