ప్రతి విద్యార్ధికి డిగ్రీతో పాటు నైపుణ్యాలు అవసరం
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): కేవలం డిగ్రీతో ఉద్యోగ పోటీలో నిలవలేమని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అదనపు నైపుణ్యాలు, విస్తృత జ్ఞానం పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ (Hemant Keshav Patil) విద్యార్థులకు సూచించారు.
శుక్రవారం నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో (Government Arts and Commerce Degree College)తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా వారం రోజులుగా నిర్వహించిన తెలుగు భాషా–సంస్కృతి కార్యక్రమాల ముగింపు వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి రంగాల్లో అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. లక్ష్యాన్ని ముందుగానే నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.