సీఎం సహాయనిధి నిరుపేదలకు అండ
రుద్రంగి సెప్టెంబర్ 18(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రానికి చెందిన 23,మంది లబ్దిదారులకు సీఎంసహానిది చెక్కులు (CM's relief fund cheques) దాదాపు 9 లక్షల 60,వేల రూపాయల విలువ గల చెక్కులను మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య (Erram Ganganarsayya)ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎర్రం గంగానర్సయ్య,సర్పంచ్ గండి నారాయణ,మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి,మాట్లాడుతూ.వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి,ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి సీఎం సహానిది పేదలకు వరంగ మారిందని ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి (Chief Minister Revanth Reddy)బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు.అలాగే మన గ్రామంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పూర్తవుతుందని అన్నారు.
మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార చేయూత అందించడం జరుగుతుందని తెలిపారు.చెక్కులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు లబ్ధిదారుల తరపున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో,కాంగ్రెస్ నాయకులు లబ్దిదారులు పాల్గొన్నారు.