యాసంగిలో ఆరుతడి పంటలే మేలు

27-11-2026 | 03:14pm

రాజాపూర్ నవంబర్ 27: రైతులు యాసంగి సీజన్ లో(Rabi season) వరిపంటకు బదులుగా ఆరుతడి పంటలు వేస్తేనే అధిక వస్తాయని ఐ సి ఏ ఆర్ వ్యవసాయ శాస్త్రవేత్త(ICAR Agricultural Scientist) శాలిని అన్నారు.శుక్రవారం తిరుమలాపూర్ గ్రామం లో కేతి బచావో అభియాన్ సమావేశం నిర్వహించి రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక పంట దిగుబడి కి నేల సంరక్షణ ముఖ్యమైనదని సూచించారు.

నేల ఆరోగ్యం కాపాడడం కోసం పంటకు రసాయన ఎరువులు, కలుపు మందులు, పురుగు మందులు అధికంగా వాడవద్దని సూచించారు.తక్కువ నీటి తో పండే మొక్కజొన్న, పెసర్లు, మినుములు వంటి పంటలు వేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష  వెంకటేష్,మండల వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్ ఏఈవో మహేశ్వర్ గ్రామ పెద్దలు పోలేపల్లి యాదయ్య, సత్యనారాయణ గౌడ్, పోలేపల్లి నర్సింలు, నారాయణ రెడ్డి,రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు