5 September, 2026 | 6:40 PM

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైనది

05-09-2026 | 05:00pm

తుంగతుర్తి (విజయ క్రాంతి): డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని, సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా, తుంగతుర్తి లైన్స్ క్లబ్(Tungaturthi Lines Club) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉపాధ్యాయ బృందమును శాలువాతో ఘనంగా సన్మానం చేసి అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షులు తల్లాడ కేదారి(Tallada Kedari) మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు, ఉపాధ్యాయుల చేతిలో తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. అతి పవిత్రమైన వృత్తి అని ఉపాధ్యాయులను కొనియాడారు. పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని సన్మానం చేయడం మా అదృష్టమని అన్నారు. లైన్స్ క్లబ్ సభ్యులు ప్రతి ఉపాధ్యాయుని శాలువాతో ఘనంగా సన్మానించడం చేశారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, లైన్స్ క్లబ్ సెక్రటరీ గుండ గాని రాము, కోశాధికారి ఓరుగంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పులుసు వెంకటనారాయణ గౌడ్, కోఆర్డినేటర్లు ఎనగందుల గిరి, ఓరిగాంటి సుభాష్, పప్పుల వెంకన్న గూడూరు శ్రీనివాస్, ఎలగందుల సంజీవ, గుజ్జ భాస్కర్, పాఠశాల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు