రూ.1.33 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

24-10-2026 | 06:49pm

అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

బాలానగర్, అక్టోబర్ 24 : బాలానగర్ మండలం(Balanagar mandal) మోదంపల్లి గ్రామంలో(Modampalli village) హెచ్‌ఎండీఏ నిధులు(HMDA Funds) రూ.1.33 కోట్లతో చేపట్టనున్న మురుగునీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు(Construction works for CC roads) శనివారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(Anirudh Reddy) శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, నిధుల కేటాయింపు, సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తోందని, ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమని అన్నారు. అనంతరం బాలానగర్ మండలంలోని గ్రామ పంచాయతీలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్, బాలానగర్ సర్పంచ్ గుమ్మల వెంకటేశ్వర్ రెడ్డి, దత్తాత్రేయ, తిరుపతి, అప్పాజిపల్లి సర్పంచ్ వెంకటేష్ నాయక్, కుమార్ నాయక్, నందారం సర్పంచ్ హార్సింగ్ నాయక్, కాంగ్రెస్ నాయకుడు రఫిక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు