సౌదీ నుంచి గిరిజనుల చేయూత

27-10-2026 | 11:46am

మృతుని కుటుంబానికి రూ.45 వేల ఆర్థిక సాయం

మహ్మదాబాద్: మంగంపేట్ తాండకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మూడవత్ లింగ్యా నాయక్(BRS leader Moodavath Lingya Naik) ఇటీవల ఆకస్మికంగా మృతి చెందగా, ఆయన కుటుంబానికి సౌదీ అరేబియా(Saudi Arabia)లోని గిరిజనులు చేయూత అందించారు. వివిధ తాండాలకు చెందిన గిరిజన నాయకులు కలిసి రూ.45 వేల ఆర్థిక సహాయాన్ని సమకూర్చి, లింగ్యా నాయక్ సతీమణి మూడవత్ చిన్నబాయికి అందజేశారు.

గ్రామపంచాయతీ సర్పంచ్ ఎస్.గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమక్షంలో ఈ సహాయాన్ని అందించి,కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.తాండలో ఎవరైనా మరణిస్తే సౌదీలో ఉన్న గిరిజనులు ప్రతి కుటుంబానికి తమ వంతు సహాయం అందించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా సౌదీలో ఉన్న గిరిజనులు,వారి కుటుంబ సభ్యులకు మంగంపేట్ తాండ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మాజీ సర్పంచ్ గీతపాండు నాయక్, తాండ నాయక్ బాల్యా నాయక్, ఎస్. రాగ్య నాయక్, కె.గోపాల్ నాయక్, ఎస్.కిషన్ నాయక్, ఎస్.సుబ్యా నాయక్, ఎం.లాల్యా నాయక్, ఎస్.మాన్య నాయక్, కె.నాగేష్ రాథోడ్, ఎం.శంకర్ నాయక్, కె.పాండు రాథోడ్, కె.శంకర్ నాయక్, కె.రమేష్ నాయక్, ఎం.బొప్ప నాయక్, ఎం.లాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు