2న రానున్న అమిత్‌షా

27-10-2026 | 05:35am

లోక్‌తంత్ర బచావో-అరాచకత హఠావో పేరుతో భారీ పాదయాత్ర

మోదీ తండ్రిపై ఖర్గేది అభ్యంతరకర భాష 

రాష్ట్రంలో తీవ్రమైన కరువు, తాగునీటి ఎద్దడి పరిస్థితులను గాలికి వదిలేసి సీఎం ఢిల్లీ పర్యటనలా? 

‘సర్’పై పచ్చి అబద్ధాలు.. మీ సొంతూరు కొండారెడ్డిపల్లికి వస్తా, డిలీట్ అయిన ఓట్లేవో చూపండి? 

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు సవాల్

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ప్రజా సమస్యలను పక్కనపెట్టి సమాజంలో, దేశంలో అరాచకాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్(Congress) యత్నిస్తోందని, ఈ అరాచక వైఖరిని ఎండగట్టేందుకు ‘లోక్‌తంత్ర బచావో -సేవ్ డెమోక్రసీ’, ‘అరాచకత హఠావో -రిమూవ్ అనార్కీ’ నినాదాలతో నవంబర్ 2వ తేదీన బీజేపీ(BJP) ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ పాదయాత్రను హైదరాబాద్‌లో(Hyderabad) నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు(N. Ramachander Rao) తెలిపారు.

ఈ పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) స్వయంగా పాల్గొని తమతో నడుస్తారని ఆయన వెల్లడించారు. దేశ రాజకీయాల్లో ఎన్నికల వేళ ప్రజలను అసత్యాలతో నమ్మించలేక, నిరాశానిస్పృహలతో దేశ ప్రధాని మోదీ(Prime Minister Modi) తల్లి తండ్రులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు వాడుతున్న అనుచిత భాష, దిగజారుడు పదజాలం ఆ పార్టీ దౌర్భాగ్యకరమైన స్థితికి అద్దం పడుతోందని  మండిపడ్డారు. 

సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  పాట్నా సభలో ప్రధాని తండ్రిని ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమని, దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

ఒక సామాన్య చాయ్‌వాలా దేశానికి ప్రధానమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేక, పన్నెండున్నర సంవత్సరాలుగా అధికారానికి దూరమై అధికారం కోసం తహతహలాడుతూ కాంగ్రెస్ నాయకులు నైతిక విలువలను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అహంకారపూరిత వైఖరికి నిరసనగా హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రె స్ పార్టీ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

రాహుల్‌ను ప్రసన్నం చేసుకునేందుకు..

ఎస్‌ఐఆర్‌పై ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నవంబర్ 1న ర్యాలీ పేరుతో వెళ్తా మంటూ చెబుతున్న రేవంత్ రెడ్డి తీరు.. రో మ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, 600లకు పైగా మండలా ల్లో దాదాపు 330 మండలాలు వర్షాభా వం, కరువుతో అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

తెలంగాణవ్యాప్తంగా 6 వేల చెరువులు ఉంటే కేవలం 500 చెరువుల్లో మాత్రమే నీరు నిలిచి ఉందని, రాజధాని హైదరాబాద్ నగరంలోనే రోజుకు సుమారు 8 వేల వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రజలు తాగునీటిని కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థి తి దాపురించిందని గుర్తుచేశారు. ప్రజలు ఇంతటి నీటి సంక్షోభాన్ని, కష్టాలను ఎదుర్కొంటుంటే వాటిని పరిష్కరించడం మానే సి, బాధ్యతను గాలికి వదిలేసి రాహుల్ గాం ధీని ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ బాట పట్టడం క్షమించరాని నేరమన్నారు.

టైం చెప్పు రేవంత్ నేను వస్తా...

సర్ ప్రక్రియ చట్టబద్ధంగా ముగింపు దశ కు చేరినా కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలను ఆపడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూటిగా సవా ల్ విసురుతూ..‘మీ సొంతూరు కొండారెడ్డిపల్లికే వస్తా.. టైం చెప్పండి.. అక్కడికే వస్తాను. మీ ఊరిలో అర్హులైన ఓటర్ల ఓట్లు అన్యాయంగా ఎక్కడ డిలీట్ అయ్యాయో చూపిం చండి. గతంలో మీ మంత్రులు విసిరిన సవాల్‌ను నేను స్వీకరించిన తర్వాత వారు పత్తా లేకుండా పోయారు. రాజ్యాంగబద్ధంగా అర్హ త ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుం ది తప్ప ఏ ఒక్కరి ఓటును అక్రమంగా తొలగించరని’ ఆయన స్పష్టం చేశారు.

రాహుల్‌ని ప్రధానిని చేయడం జోకు..

రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానంటూ రేవంత్ రెడ్డి జోకులు వేస్తున్నారని, అయితే రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 2008 నాటి 1182 నుంచి నేడు 660 స్థాయికి పడిపోగా, బీజేపీ బలం 880 నుంచి 1500 పైచిలుకుకు ఎగబాకిందని గణాంకాలతో వివరించారు. మార్కెట్‌లో ఇప్పటికే విఫలమైన ఉత్పత్తిని మళ్లీ ప్రమోట్ చేయాలని చూడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు.అలాగే, గోదావరి ఉమ్మడి నది అని, జీఆర్‌ఎంబీ ఇచ్చే అవార్డును రెండు తెలుగు రాష్ట్రాలు గౌరవిం చాల్సిందేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి (మేడిగడ్డ) బ్యారేజీ నాణ్యత లోపాలకు గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమే కారణమని స్పష్టం చేశారు.

ఎన్డీఎస్‌ఏ రిపేర్ల ను ఎన్నడూ అడ్డుకోలేదని, రైతుల ప్రయోజనాల దృష్ట్యా మరమ్మతులు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. నీటి వివాదాల్లో జిల్లాల మధ్య చిచ్చుపెట్టి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కాంగ్రెస్ మానుకోవాలని, తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి, ప్రతి జిల్లాకు న్యాయబద్ధంగా నీటి వాటా దక్కేలా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీ పాదయాత్రను ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే అవకాశముంది.

మరిన్ని వార్తలు