పండుగ సాయన్నకు జిల్లా ఎస్పీ ఘన నివాళి

22-10-2026 | 05:48pm

మహబూబ్‌నగర్ (విజయ క్రాంతి): తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జయంతి(Birth Anniversary of Panduga Sayanna) సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో (District Police Office)ఎస్పీ డి.జానకి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పేదలు, అణగారిన వర్గాల కోసం దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన పండుగ సాయన్న జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను స్మరించుకోవడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఏఓ రుక్మిణి భాయ్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ మోతిరామ్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు