ఆ బీటీ రోడ్డు బాగున్నట్టా? లేనట్టా
- అద్భుతం అంటూ కాంగ్రెస్.. అస్సలు బాలేదంటూ బీఆర్‌ఎస్
- తమకేమీ సంబంధం లేదంటూ అధికార యంత్రాంగం మౌనం
- నాణ్యత ఉంటే అధికారులు చెప్పాలంటూన్నా ప్రతిపక్షం
- కావాలని రాద్ధాంతం చేస్తుండంటూ కాంగ్రెస్ నేతలు
- మండల వ్యాప్తంగా రోడ్డు నాణ్యతపై తీవ్ర చర్చ
- దాదాపు 2 కి, మీలు రూ.2 కోట్ల తో బీటీ రోడ్డు నిర్మాణం
మహమ్మదాబాద్, అక్టోబర్ 30: మండల పరిధిలో అధికార పార్టీ కాంగ్రెస్(Congress) నేతలు ఒకవైపు.. బీఆర్‌ఎస్(BRS) పార్టీ నేతలు మరోవైపు ఇటీవల ఒకేరోజు ఉదయం ఓ పార్టీ నేతలు సాయంత్రం మరో పార్టీ నాయకులు రోడ్డు బాగుంది అద్భుతంగా వేశామంటూ ఒకరు నినాదాలు చేస్తే మరొకరు అస్సలు బాలేదు నాణ్యత లోపించింది అంటూ మరొకరు నిరసన వ్యక్తం చేసిన సంఘటన మండల వ్యాప్తంగా చర్చకు దారి తీస్తుంది.
మండల పరిధిలోని నంచర్ల నుంచి చౌదర్పల్లికి వేసిన ఈ రోడ్డుతో ఆ ప్రాంతంలోని రైతులకు ఎంతో మేలు చేకూర్చిన్నప్పటికీ నాణ్యత మాత్రం లేదంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ నినాదాలు చేసిండ్రు. రోడ్డు పక్కనే రోడ్డు నిర్మాణం కోసం భారీ మట్టిని తవ్వి రోడ్డుకు ఉపయోగించుకొని పెద్ద గుంత అయ్యేందుకు కారణమయ్యారంటూ బిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.
నాణ్యత ఎక్కడ రాజీలేకుండా నియమ నిబంధనలను పాటించి రోడ్డు నిర్మాణం వేశామంటూ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. కాగా జనం మాత్రం అసలు నాణ్యత ఉందో? లేదో? ఒక మారు సంబంధిత అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రోడ్డు నాణ్యతగా వేయడం జరిగిందంటూ చెబితే తప్పేముందంటూ జనం చెబుతున్నా మాట.
రూ రెండు కోట్లతో రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం..
దాదాపు రెండు కోట్ల నిధులతో రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం వేయడం జరిగింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేసి నాణ్యత విషయంలో అధికారిక ప్రకటన చేయాలని జనం కోరుతున్నారు. అధికారులే నాణ్యతగా ఉందని పేర్కొంటే ఈ రాద్ధాంతం ముగింపు పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ భిన్న అభిప్రాయాలకు ప్రధాన కారణం బీటీ రోడ్డు పక్కనే భారీ ఎత్తున గుంత ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తుండ్రు.
నియమ నిబంధనలు పాటిస్తే రోడ్డు పక్కన పెద్ద ఎత్తున ఎందుకు తవ్వి భారీ గుంతను ఏర్పాటు చేస్తారని ఇది సరైన విధానం కాదంటూ కొంతమంది బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతుండ్రు. ఈ విషయంపై మండల వ్యాప్తంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నేతలు చేసుకుంటున్న చర్చ ఒక్కసారిగా ఉప్పందుకుంది. ఈ ఈ చర్చ ముగింపు పలకాలంటే అధికార యంత్రంగం స్పందిస్తేనే బాగుంటుందంటూ కొందరు చెబుతున్నారు. ఈ చర్చకు ముగింపు పడుతుందా మరింత ముందుకు సాగుతుందా చూడాలి.
శిలాఫలకంపై మంత్రి వాకిటి శ్రీహరి పేరు ఎక్కడ?
కొందరు బీఆర్‌ఎస్ నేతలు శిలాఫలకంపై మంత్రి వాకిటి శ్రీహరి పేరు ఎక్కడ కనిపించడం లేదంటూ ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా ఇటీవల నిరసన వ్యక్తం చేసిన సమయంలో ఆవేదన వ్యక్తం చేసిండ్రు. దీంతో సంబంధిత పంచాయతీ రాజ్ ఎఈ మూతిన్ సంప్రదిస్తే త్వరలోనే మంత్రి వాకిటి శ్రీహరి పేరు శిలాఫలకంపై ఏర్పాటు చేయడం జరుగుతుందని విజయ క్రాంతి దినపత్రిక కు తెలిపిండ్రు.