PRC ని వెంటనే ప్రకటించాలి
విజయ క్రాంతి/ మూసాపేట్: మూసాపేట మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(Telangana State United Teachers Federation) మూసాపేట మండల కమిటీ ఆధ్వర్యంలో TSUTF మండల మహాసభను నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా MEO శ్రీ నాగయ్య హాజరై ప్రసంగిస్తూ నిబద్ధత కలిగిన, నిస్వార్థంతో బడుల బాగు కోసం పనిచేసే ఉపాధ్యాయులు ఉండే సంఘం TSUTF, నిక్కచ్చిగా మాట్లాడే సంఘం అని అభినందించారు.
ముఖ్య వక్త గా హాజరైన TSUTF జిల్లా ప్రధాన కార్యదర్శి N. వెంకటేష్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సెలవులకు కొత్త నిబంధనలు పెట్టి ఎవరు ఈ నెలలో సెలవులు పెట్టవద్దని చెప్పడం సరైనది కాదని అన్నారు. నేటి పాలక పార్టీ ఉద్యోగులను అడగకుండానే మీ సమస్యలు పరిష్కరిస్తాం అని అధికారంలోకి వచ్చిన వెంటనే PRC ప్రకటిస్తాం, ఉద్యోగులకు అభద్రతగా ఉన్న నూతన పెన్షన్ CPS ను రద్దు చేస్తామన్న హామీలను నేటికీ అమలు పరచలేదు.
NEP 2020 లో భాగంగా నేడు ప్రభుత్వం ముందస్తు ఏమీ చెప్పకుండా ఇంటర్ బోర్డును రద్దు చేస్తామని, పాఠశాలల్లో 11వ, 12వ తరగతులు ప్రారంభిస్తాం అంటూ ప్రకటించారు. మళ్లీ నాలుగు రోజులకు ఇంటర్ బోర్డు విలీనంపై అధ్యాయం చేస్తాం అంటూ గందరగోళ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేటికి PRC ఇవ్వవలసిన సమయం పూర్తి అయ్యి మూడు సంవత్సరాలు గడిచిన PRC ప్రకటన చేయలేదు. దీని వల్ల అనేక ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం PRC ని వెంటనే ప్రకటించి అమలు చేయాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
అనంతరం మండల మహాసభ కార్యక్రమం TSUTF మండల అధ్యక్షులు శ్రీమతి రాధా, మండల ప్రధాన కార్యదర్శి ఏ నరేష్ కుమార్ గారు కొనసాగించారు. మహాసభ పరిశీలకులుగా వి. భాస్కర్ జిల్లా కోశాధికారి గారు వ్యవహారించారు. ఈ సందర్భంగా మండల TSUTF నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది TSUTF మండల అధ్యక్షులుగా శ్రీమతి రాధ , ప్రధాన కార్యదర్శిగా ఏ నరేష్ కుమార్ , ఉపాధ్యక్షులుగా మన్యం, పద్మ గార్లు కోశాధికారిగా శివకుమార్ , కార్యదర్శులుగా అరుణ్ కుమార్ రెడ్డి, నర్సప్ప, రాకేష్,విజయుడు గార్లు తదితరులు ఎన్నికయ్యారు.