ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ
23-11-2026 | 06:44pm
ఆసిఫాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ నితికా పంత్(SP Nitika Pant) సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలో చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు పోలీస్ శాఖ ప్రజావాణి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.