పట్టాలు ఇచ్చి...పట్టింపు చేస్తలేరు

23-11-2026 | 06:51pm

CPI(ML) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్ డిమాండ్ 

సిరికొండ, నవంబర్ 23(విజయ క్రాంతి):మండలంలోని పందిమడుగు  చీమన్ పల్లి  పంచాయితీ(Cheemanpalle Panchayat) పరిధి గ్రామాలలో గత మూడు తరాలుగా  చేస్తున్న పేదలైన దళిత బీసీ వర్గాలకు చెందిన వారికి పట్టాలు ఇచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అటవీ అధికారులు వేదించడం ఆపపాలని  సిపిఐ ఏం ఎల్  మాస్ లైన్ కార్యదర్శి  వి ప్రభాకర్ ఆరోపించారు.  CPI(ML) మాస్ లైన్ సిరికొండ, ధర్పల్లి సంయుక్త మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం  సిరికొండ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

మూడు తరాలుగా సాగు చేస్తున్న పేదలైన దళిత బీసీ వర్గాలకు చెందిన పేదలకు పాత పట్టా పాస్ బుక్కులు,డిజిటల్ పాస్ బుక్ లు ఇచ్చిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇందిరా జల ప్రభ ( సి ఎల్ డి పీ) స్కీం కింద విధ్యుద్ధికరణ కల్పించి ట్రాన్స్న్సపర్ మర్లు అంధిచి, తమ భూములను డెవలప్ చేసి బోరు బావులు వేసినా భూములలో నేడు అటవీశాఖ అధికారులు సాగుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు .

జెండాలు పాతి భయభ్రాంతులకు గురి చేసి ఇట్టి భూములలో గత మూడు తరాలుగా క్రాఫ్ లోన్స్ తీసుకొని జీవిస్తున్న భూముల పైన ఫారెస్ట్ అధికారుల కవ్వింపు  చర్యలను వెంటనే మానుకోవాలని అన్నారు.2006 అటవీ హక్కుల చట్టం కూడా వర్తిస్తుందని పాత పట్టాలను దృష్టిలో ఉంచుకొని సా గును దృష్టిలో ఉంచుకొని ఇట్టి భూములపైన అటవీ అధికారుల యొక్క అడ్డంకులు సృష్టించడాన్ని నిలుపుదల చేసే విధంగా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

కార్యక్రమం లో P రామకృష్ణ రాష్ట్ర నాయకులు,ఆర్. రమేష్ ,సిరికొండ ధర్పల్లి సంయుక్త మండల కార్యదర్శి,S సురేష్ జిల్లా నాయకులు  లు ప్రసంగించగా బి. బాబన్న ,ఆర్మూర్ డివిజన్ నాయకులు, రిక్కా దామోదర్ ,ఆర్మూర్ డివిజన్ నాయకులు, ఏం సాయిరెడ్డి ,ఆర్మూర్ డివిజన్ నాయకులు,బి. సర్పంచ్ సాయిలు ,మండల నాయకులు , కే.ఆశీస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు