గుంతల రహదారికి తాత్కాలిక ఉపశమనం!

23-11-2026 | 06:43pm

ఎమ్మెల్యే ఆదేశాలతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ నాయకులు

వేమనపల్లి,( విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో(Vemanapalli Mandal) నీల్వాయి–మల్లంపేట రహదారి గుంతలమయమై వాహనదారులకు నరకం చూపిస్తుండటంతో కాంగ్రెస్ నాయకులు స్పందించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి(Bellampalli MLA Gaddam Vinod Venkataswamy) ఆదేశాల మేరకు మాజీ జడ్పీటీసీ ఆర్. సంతోష్ కుమార్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, నీల్వాయి సర్పంచ్ చెన్నూరి సమ్మయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి మధు చొరవ తీసుకుని సోమవారం తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.

జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో మట్టిని తరలించి రహదారిపై ఉన్న గుంతలను పూడ్చివేశారు. ఇటీవల రహదారిని పరిశీలించిన ఎమ్మెల్యే త్వరలోనే శాశ్వత నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అప్పటివరకు ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. మరమ్మతులతో వాహనదారులకు కొంత ఉపశమనం లభించనుంది. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు