వ్యర్థాల నుంచే వనరులు!

27-11-2026 | 05:30am
  1. చెత్త కుప్పల నుంచే ఆదాయం
  2. జీరో వేస్టేజ్ ప్లాంట్ ఏర్పాటు ఒక అద్భుతం
  3. ప్రస్తుతం డంపింగ్ యార్డ్‌లోనే  చెత్త శుద్ధికరణ 
  4. చెత్తతో రాష్ట్రంలోనే తొలి గ్యాస్, విద్యుత్ ప్లాంట్ 
  5. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో కార్పొరేట్లకు అవగాహన 
  6. నగర అభివృద్ధి మన చేతుల్లో అంటు సర్కార్ పిలుపు
  7. ప్రజలకు ఎంతో మేలు: రామాంజుల రెడ్డి మున్సిపల్ నగర కమిషనర్

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): భూమికి ఇచ్చే చెత్తే రేపు మన పిల్లలకు వారసత్వంగా మిగలకూడదు. భవిష్యత్తు తరానికి అందించాల్సింది చెత్త కుప్పలు కాదు.. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఆరోగ్యకరమైన భవిష్యత్తు.. ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. చెత్త అనేది సమస్య కాకూడదు.. చెత్త కుప్పల నుంచి సంపద సృష్టించే దిశగా ముందుకు సాగాలి..

వ్యర్థమే వనరుగా మారితే అభివృద్ధికి అసలైన అర్థం లభిస్తుంది. ఈ చెత్తతో సంపదగా మార్చలేకపోవడమే అసలైన సమస్య గా గత దశాబ్దాల కాలంగా వస్తుంది.. ఈ సమస్యకు చరమగీతం పాడేందుకు మహబూబ్ నగర్ కార్పొరేషన్(Mahabubnagar Corporation) సరికొత్త ఆలోచనలకు పదును పెడుతూ నూతన అడుగులకు శ్రీకారం చుడుతుంది. చెత్త నుంచి సంపద సృష్టిస్తూ కాలుష్యానికి చెక్ పెట్టి భావితరాలకు పరిశుభ్రమైన నగరం ను అందించే సరికొత్త ఆలోచనను ఆచరణలోకి జీరో వేస్టేజ్ ప్లాంట్ తీసుకోస్తుంది మహబూబ్ నగర్ కార్పొరేషన్.

చెత్తతో రాష్ట్రంలోనే తొలి గ్యాస్, విద్యుత్ ప్లాంట్

ఒకప్పుడు అభివృద్ధికి కొలమానం రహదారులు, భవనాలు, పరిశ్రమలు మాత్రమే అనుకునేవారు. కానీ మారుతున్న కాలంలో ఒక నగరం ఎంత చెత్తను ఉత్పత్తి చేస్తుందన్నది కాదు.. ఆ చెత్తను ఎంత సమర్థంగా వినియోగించుకుంటుందన్నదే నిజమైన అభివృద్ధికి కొలమానంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో జీరో వేస్టేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయం అంటూ నగరవాసులు చెబుతుండ్రు.

చెత్తను పారేయడం పరిష్కారం కాదు.. దాన్ని సమస్యగా మారకుండా చూడటమే నిజమైన పరిష్కారం. మనం ప్రతిరోజూ ఇళ్ల నుంచి బయటకు పంపే తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు సరైన విధంగా వేరు చేసి, శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేస్తే అవే విలువైన వనరులుగా మారే అవకాశం ఉంది. తడి చెత్తతో సేంద్రియ ఎరువు, సాధ్యమైన చోట బయోగ్యాస్, పునర్విని యోగానికి అనువైన వ్యర్థాలతో కొత్త ఉత్పత్తులు తయారు చేయవచ్చు. పనికిరాని వ్యర్థాలను కూడా పర్యావరణానికి హాని కలగకుండా శాస్త్రీయంగా నిర్వహించవచ్చు అంటు అభివృద్ధి అడుగులు వేస్తుంది.

పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది

జీరో వేస్టేజ్ ప్లాంట్ పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. నగరంలోని 60 డివిజన్లో నుంచి దాదాపుగా 107 మెట్రిక్ టన్నుల తడి పొడి చెత్త వస్తుంది. ఈ చెత్తను ప్రత్యేక వాహనాల ద్వారా కోయిలకొండ ఎక్స్ రోడ్డు లోని డంపింగ్ యార్డ్ కు తరలిస్తుండ్రు. ఏండ్ల తరబడి ఇక్కడ చెత్త వేయడంతో ఒక్కసారిగా గుట్ట మాదిరిగా చెత్త పేరుకుపోయింది. ఈ అంశాన్ని ప్రజలు ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా చేయాలని సంకల్పంతో జీరో వేస్టేజ్ ప్లాంట్ ను తీసుకువచ్చి చెత్తను ఎప్పటికప్పుడు శుద్ధిచేసి తడి చెత్త తో గ్యాస్ ను పొడిచెత్త తో విద్యుత్ ను తయారు చేసే ప్లాంటే జీరో వేస్టేజ్ ప్లాంట్. 

ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డ్ లోనే చెత్త పూర్తిగా శుద్ధిచేసి తడి, పొడి చెత్త ను రోల్ మాదిరిగా డంపింగ్ యార్డ్ లోనే తయారు చేసి బండమీదిపల్లి దగ్గర 38 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న జీరో వేస్టేజ్ ప్లాంట్ కు తరలిస్తారు. ఇక్కడ ఎలాంటి దుర్వాసనతో పర్యావరణ ఇబ్బందులు లేకుండా ఈ ప్లాంట్ రూపకల్పన చేస్తుండ్రు. 25 ఎకరాలే ఈ ప్లాంట్ కు అవసరం ఉన్నప్పటికీ 38 ఎకరాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో  చుట్టు ముట్టు ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కార్పొరేటర్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జీరో వేస్టేజ్ ప్లాంట్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేసిండ్రు. 

 చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం

నిజానికి చెత్త సమస్య మున్సిపాలిటీ ఒక్కదానిది కాదు.. ప్రతి ఇంటి బాధ్యత కూడా! మన ఇంటి గుమ్మం దాటిన చెత్త ఎక్కడికి వెళ్తోంది? అది భూమిలో కలుస్తోందా? నీటిని కలుషితం చేస్తోందా? గాలిలో విషాన్ని నింపుతోందా? లేక మరొక ఉపయోగక రమైన ఉత్పత్తిగా మారుతోందా? అనే ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన సమయం వచ్చింది.

- రామాంజుల రెడ్డి  రెడ్డి మున్సిపల్ నగర కమిషనర్, 

మహబూబ్ నగర్

మరిన్ని వార్తలు