అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

13-10-2026 | 07:42pm

అదనపు కలెక్టర్ చంద్రయ్య

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మండలంలోని గ్రామపంచాయతీలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య(Additional Collector Chandraiah) అన్నారు. మంగళవారం మండలంలోని బూదకలాన్ జీపీలో చేపడుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

గ్రామపంచాయతీకి నూతన భవన నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన స్థల సేకరణపై మండల తహసిల్దార్, అధికారులతో సమీక్షించి స్థల సమస్యను పరిష్కరించారు. గ్రామంలో నిర్మించిన కల్వర్టును, అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ రేణుకుంట్ల మహేందర్, ఎంపీఓ కృష్ణవేణి, సర్పంచులు దాడి నగేష్, వంగ రాములు, సాగర్ల లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు