అమ్మవార్ల కొలుపు ఉత్సవాల్లో ఆధ్యాత్మిక సందడి
మంచిర్యాల కల్చరల్ (విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్, నస్పూర్ మండలం సీతారాంపల్లిలో భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ తల్లుల కొలుపు ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. (Temple Celebrations) ఈ వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ తల్లుల ఆశీస్సులతో సీతారాంపల్లి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామంపై అమ్మవార్ల కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. (Special Prayers)
గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. (Cultural Heritage) పూర్వీకుల సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించడంలో ఈ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. (Community Participation) ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య, గ్రామ పెద్దలు, ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.