నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలి

19-09-2026 | 12:49pm

 బెల్లంపల్లి పోచమ్మ చెరువును విజిట్ చేసిన డీసీపీ భాస్కర్, సబ్ కలెక్టర్మనోజ్  

బెల్లంపల్లి,(విజయక్రాంతి):ఆహ్లదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనోత్సవాన్ని(Ganesh immersion procession) జరుపుకోవాలని మంచిర్యాల డీసీపీ(Mancherial DCP) ఎగ్గడి భాస్కర్ అన్నారు. బెల్లంపల్లి పోచమ్మ చెరువు(Bellampalli Pochamma Cheruvu) నిమజ్జనం ఏర్పాట్లను ఆయన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీ సీ పీ భాస్కర్ మాట్లాడారు. జిల్లాలో 2008 గణేష్ మండల్లు ఉన్నాయన్నారు. గణేష్ నిమజ్జనాన్నీ ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. నిమజ్జనం ఏర్పట్లూ అత్యంత కట్టుదిట్టంగా చేపడతామన్నారు. జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూరు,మంచిర్యాల, గూడెం ప్రాంతాల్లో నిమజ్జనోత్సవం  జరుగుతుందన్నారు.

నిమజ్జనం సందర్భంగా గట్టి పోలీసు బందోబస్తు ను ఏర్పాటు చేస్తామన్నారు. చెరువుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ  చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలీసులు తమ వంతుగా నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని డీ సీ పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి, తహసిల్దారు లావుడి య కృష్ణ, బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్, ఎస్సైలు తిరుపతి, రామకృష్ణ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు