టైర్ మారుస్తుండగా దుర్ఘటన: ముగ్గురు స్పాట్ డెడ్
19-09-2026 | 09:08am
శామీర్ పేట: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా శామీర్ పేట ఔటర్ రింగ్ రోడ్డుపై( Shamirpet Outer Ring Road) శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బండి పంచర్ కావడంతో రోడ్ సైడ్ వాహనాన్ని నిలిపి టైర్ మారుస్తుండగా వెనకనుంచి దూసుకొచ్చిన వ్యాన్ టైర్ మారుస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాచారంకు చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.