బలరామ జయంతి ..ఉత్తమ రైతు, ఉపాధ్యాయులకు సన్మానం
19-09-2026 | 01:31pm
సదాశివనగర్, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బలరామ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు జెండాను ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఉత్తమ రైతులతో పాటు, విద్యారంగంలో సేవలందిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.