ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన ఏడీఏ
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండల కేంద్రంలోని ఎరువుల (fertilizer) దుకాణాలను చెన్నూర్ వ్యవసాయ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) బానోత్ ప్రసాద్ చెన్నూర్, మండల వ్యవసాయ అధికారి (MAO) కె. యామినితో కలిసి తనిఖీ చేశారు.
జిల్లాకు పక్కనున్న భూపాలపల్లి, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఎరువులు వస్తున్నాయన్న సమాచారం మేరకు మండల కేంద్రంలో పాటు మండలంలోని చెన్నూరు, అంగరాజుపల్లి, ఆస్నాద్, దుగ్నేపల్లి, సుందరశాల, కత్తెరసాల గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను, గోదాములను పరిశీలించారు.
ఈ సందర్భంగా ada ప్రసాద్ మాట్లాడుతూ రైతులు ఎరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమతులేని చెరువులను ఉపయోగించవద్దని సూచించారు. NPK మిక్చర్ ఎరువులలో నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలు తగిన మోతాదులో లేకపోవచ్చని, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.