గిరిజన ఉద్యోగాలపై గళమెత్తిన కవిత

13-10-2026 | 10:29am

హైదరాబాద్‌: తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు (Police Constable Jobs) ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవిత డిమాండ్‌ చేశారు. గతంలో జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్లలో ఈ రిజర్వేషన్ల అంశాన్ని పేర్కొన్నారని ఆమె గుర్తుచేశారు. 

ఈ ఏడాది విడుదల చేసిన పోలీస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌లో (Police Recruitment Notification) ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయలేదని కవిత ఆరోపించారు. దీనివల్ల గిరిజన యువత 400కు పైగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు కల్పించాల్సిన రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి

హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశంపై స్పందించాలని కవిత డిమాండ్‌ చేశారు. ఆదివాసీ, గిరిజన యువతకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ నియామకాల్లో 75 శాతం రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు