ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు

02-10-2026 | 04:57pm

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో గా జాతి పిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో(Congress Party Office) జరిగిన వేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి పాల్గొన్నారు. గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మునిసిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మునిసిపల్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి, మునిసిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలుము ల శంకర్, దావరమేశ్, మునిసిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు