జర్నలిస్టు నాయకుల బహిరంగ లేఖలు

02-10-2026 | 07:45pm

గాంధీ జయంతి సందర్భంగా సీఎంకు టీ యు డబ్ల్యూ జె  143

మాగనూరు, అక్టోబర్2. గాంధీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (Telangana Union of Working Journalists)143. మాగనూరు జర్నలిస్టు ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కి పోస్ట్ కార్డు ద్వారా బహిరంగ లేఖలు పంపించడం జరిగినది. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.

రాష్ట్రంలో జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు వెంటనే అందించాలని యూనియన్ ప్రతినిధులు కోరారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యపరముగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమముకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ,ఆరోగ్య భద్రత ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు.

జర్నలిస్టుల సమస్య లకు ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి  త్వరితగతముగా పరిష్కరించాలని టి యు డబ్ల్యూ జె హెచ్ 143 నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రహల్లాద రెడ్డి, రాజు, రాము, చంద్రశేఖర్ గౌడ్, అంజయ్య, తాయప్ప, శ్రీనివాసులు, అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు