దగ్గరుండి పనులను పరిశీలించిన ఎస్ఈ

13-10-2026 | 01:29pm

‘విజయక్రాంతి’ ఎఫెక్ట్

- డిమాండ్ మేరకు ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం పెంపు

కోటపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) కోటపల్లి మండలంలో విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ‘విజయక్రాంతి’లో ఈ నెల 9న ‘కరెంటు కోతలతో రైతుల కంట కన్నీరు..!’ పేరిట ప్రచురించిన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. విద్యుత్ కోతలకు గల కారణాలను మంచిర్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) బీ రాజన్న స్వయంగా సోమ వారం పరిశీలించారు.

కోతల నివారణ కోసం కోటపల్లి మండల కేంద్రంలో ఉన్న 5 ఎంవీఏ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్(MVA Transformer) స్థానంలో దాని సామర్థ్యాన్ని పెంచి 8 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ను దగ్గరుండి ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ విద్యుత్ వినియోగం నిరంతరం పెరుగుతున్నందున టీజీఎన్‌పీడీసీఎల్ పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నా ప్రస్తుత మన్నారు.

వినియోగదారులకు మెరుగైన వోల్టేజ్‌తో పాటు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు క‌ృషి చేస్తున్నామన్నారు. ఎస్ఈ వెంట మంచిర్యాల డీఈ ఎంఎం ఖైసర్, ఏడీఈలు బాలకృష్ణ, శరత్, సబ్ ఇంజనీర్ ఎన్ సురేష్, లైన్ ఇన్ స్పెక్టర్ అశోక్ రావుతో పాటు సర్పంచులు ఆలూరి సంపత్, గోపి, నాయకులు రాంరెడ్డి, కాట్రాల మల్లయ్య, రైతులు తదితరులున్నారు.

మరిన్ని వార్తలు