ధాన్యం నిల్వకు స్థలాలను గుర్తించి యాప్‌లో నమోదు చేయాలి

22-09-2026 | 11:17pm

- అదనపు కలెక్టర్ రాములు

మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 22 : జిల్లాలో ధాన్యం నిల్వకు అందుబాటులో ఉన్న గోదాములు, ఇతర నిల్వ సామర్థ్యాన్ని గుర్తించి సంబంధిత యాప్‌లో వివరాలు నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు(District Additional Collector V. Ramulu) అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, మేనేజర్ శ్రీకళలతో కలిసి ఎస్‌డబ్ల్యుసి గోదాముల మేనేజర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా అవసరమైన నిల్వ స్థలాలను గుర్తించి అందుబాటులో ఉంచాలని తెలిపారు.

సామర్ధ్యానికి అనుగుణంగా రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం సిఎంఆర్ డెలివరీలను వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని మిల్లర్లకు సూచించారు. సిఎంఆర్ డెలివరీలో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అనంతరం వానాకాలం 2026-27 సీజన్‌కు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రతినిధులు, మెప్మా, డి.సి.ఎం.ఎస్. ప్రతినిధులతో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు.

మరిన్ని వార్తలు