దసరా నాటికి పెద్దపల్లి ఆర్టీసీ డిపో ప్రారంభం
రూ.8 కోట్లతో నిర్మాణం.. నాణ్యతలో రాజీ వద్దు
పెద్దపల్లి లో బస్ డిపో పనులు పరిశీలనలో ప్రభుత్వ విప్ విజయరమణ రావు
పెద్దపల్లి, సెప్టెంబర్ 22: జిల్లా కేంద్రంలో రూ.8 కోట్లతో నిర్మిస్తున్న నూతన ఆర్టీసీ బస్సు డిపో పనులు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు(MLA Chinthakunta Vijaya Ramana Rao) తెలిపారు. మంగళవారం ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి డిపో నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి ప్రజల చిరకాల స్వప్నమైన బస్సు డిపోను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పనులు వేగంగా కొనసాగుతున్నాయని, దసరా నాటికి డిపోను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని, నిర్మాణంలో నాణ్యత ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని గుత్తేదారులకు సూచించారు. అంతకుముందు పెద్దపల్లి పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించిన విజయరమణ రావు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.