వ్యవసాయ అభివృద్ధి పై అవగాహన సదస్సు
22-09-2026 | 11:48pm
చేగుంట సెప్టెంబర్ 22: జైత్రం తండాలో ఎస్. ఎం. సెహగల్ ఫౌండేషన్, హెచ్‌డీఎఫ్‌సీ పారివర్తన్(HDFC Parivartan) ఆధ్వర్యంలో రైతులు, మహిళా రైతుల కోసం మంచి వ్యవసాయ పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఐపిహెచ్ఏం హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్త డా. పి. శక్తివేల్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు సేంద్రియ ఎరువులు, వర్మీకంపోస్ట్, కంపోస్ట్ తయారీ విధానాలు, ఎరువుల వినియోగం, పోషక యాజమాన్యం, నేల ఆరోగ్యం పంటల ఉత్పాదకతపై సాంకేతిక అవగాహన కల్పించారు.