ప్రశాంతంగా మంచిర్యాల ఆర్టీసీ ఎన్నికలు

09-10-2026 | 05:55pm

మంచిర్యాల టౌన్, అక్టోబర్ 9 : మంచిర్యాల టీజీఎస్ ఆర్టీసీ డిపోలో(Mancherial TGSRTC Depot) కార్మిక సంఘాల(labor unions) ఎన్నికల పోలింగ్(Election polling) ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమైంది. మంచిర్యాల డిపో పరిధిలో మొత్తం 403 మంది ఆర్టీసీ కార్మికులు(RTC workers) తమ ఓటు హక్కును(Right to vote) వినియోగించుకోనున్నారు. ప్రధానంగా ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ వర్కర్స్ యూనియన్(Telangana Workers Union) ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ఎజెండాగా బరిలోకి దిగిన ఇరు యూనియన్ల నేతలు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా తలపడుతున్నారు.

ఉదయం నుంచే కార్మికులు బారులు తీరి ఓటు వేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు డిపో ప్రాంగణంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. మంచిర్యాల డిపోపై ఏ యూనియన్ పట్టు సాధిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు