సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, (విజయక్రాంతి) : సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరమని శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం)(General Manager, Singareni Srirampur Area) మునిగంటి శ్రీనివాస్ అన్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ఉద్యోగులను జాగురత పరచటంలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఏరియాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా అధికారులు, ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగుల కోసం తలపెట్టిన 37వ అవగాహన కార్యక్రమం గురువారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించగా ముఖ్య అతిధిగా జీఎం పాల్గొని శ్రీరాంపూర్ ఏరియా సీనియర్ ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్ తో కలిసి మాట్లాడారు. సైబర్ నేరగాల్లు అనుసరిస్తున్న వ్యూహాలు, వాటి భారిన పడి ఆర్థికంగా, సామాజికంగా బాధితులుగా మారకుండా అనుసరించాల్సిన చర్యలు వివరించారు.
ముఖ్యంగా ఈమేయిల్స్, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ విషయంలో అప్రమత్తత అవసరమన్నారు. ఇంటర్నెట్ సేవలు, ఫైల్స్ డౌన్ లోడ్ ల కోసం ఇష్టానుసారాంగా లింక్లు ఓపెన్ చేయకుండా నమ్మకమైన బ్రౌజర్లనుంచే జరపాలని సూచించారు. ఈమేయిల్ తో పాటు సోషల్ మీడియా, ఆన్లైన్ బ్యాంకింగ్, ఇతర పాస్వర్డ్లు పటిష్టంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. వీటితోపాటు మొబైల్ లో వాడే ఆప్ లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే సైబర్ నేరాల నుంచి తప్పించుకోవచ్చని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత పాస్వర్డ్లు ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడాలన్నారు. అలాగే మొబైల్ ఫోన్ విషయంలో మరీ ముఖ్యంగా వివిధ ఆప్ లకు పర్మిషన్లు ఇవ్వటంలో కూడా పరిమితులకు లోబడి వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా సింగరేణి సంస్థలో అధికారిక సమచారాన్ని సేఫ్ గా ఉంచటం, అనుమానస్పద కార్యకలాపాలను వెంటనే పై అధికారుల దృష్టికి తేవటం,
క్రింది స్థాయిలో ఆన్ లైన్ సేవలు దుర్వినియోగం జరగకుండా చూడాలని కోరారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా సైబర్ భద్రతపై 20 మర్కులకు గాను నిర్వహించిన పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జీఎం కృష్ణ ప్రసాద్, సీనియర్ ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఏరియా అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.