తెలంగాణ భాషా దినోత్సవం వేడుకలు

09-09-2026 | 06:37pm

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల(Telangana Social Welfare Gurukul Women's Degree College)లో తెలంగాణ భాషా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం తెలుగు డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల సందర్భంగా విద్యార్థులనుద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పత్తి సునీత మాట్లాడారు. తెలంగాణ భాష గొప్పతనాన్ని, అందులోని మాధుర్యాన్నితెలియజేస్తు తెలంగాణ భాషను కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. తెలంగాణ భాషా దినోత్సవాన్ని(Telangana Language Day celebrations) పురస్కరించుకొని విద్యార్థులకు ఉపన్యాస, పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్  ప్రిన్సిపాల్ వహీదా, తెలుగు  అధ్యాపకులు కె. సరిత, కె.రజిత, ఆర్ మమత విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు