17వ రోజు లైఫ్ లైన్ ఉచిత వైద్య శిబిరం

01-11-2026 | 08:56pm

కాగజ్ నగర్ (విజయక్రాంతి): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ ఆవరణలో లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్, ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరం(Free Medical Camp) ఆదివారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. ఈ వైద్య శిబిరంలో కంటి, డెంటల్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్లు చేస్తున్నారు. అవసరమైన రోగులకు కంటి అద్దాలు, మందులు పంపిణీ చేస్తున్నారు. ప్రతిరోజు ఈ వైద్య శిబిరానికి  సుమారు 300 మందికి పైగా రోగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు, వారి బంధువులకు, వైద్య సిబ్బందికి. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు ఆధ్వర్యంలో ఉచితంగా మంచినీరు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు