చలో ఢిల్లీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న నియోజకవర్గ నాయకులు
బోథ్ నవంబరు 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు నియోజకవర్గంలో నుండి నాయకులు(Congress Leaders) భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ ఆధ్వర్యంలో తరలి వెళ్లడం జరిగింది. ఢిల్లీలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న నాయకులు అక్కడే రాష్ట్రస్థాయి నాయకులను కలవడం జరిగింది.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, తలమడుగు మాజీ జెడ్పిటిసి గణేష్ రెడ్డి, జిల్లా ప్రింటర్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ డేరా కృష్ణారెడ్డి, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, మండల పార్టీ కన్వీనర్ మెరుగు భోజన్న, టీపీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కురుమే మహేందర్, ఉప సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు బొజ్జ సాయన్న, సీనియర్ నాయకులు లోలపు పోసెట్టి, సోనాల మండల పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న, మౌలానా బుక రాములు తదితరులు ఉన్నారు.