భరోసా వైపే పట్టభద్రులు: రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
వెల్దండ నవంబర్ 01: పట్టపద్రులంతా బారాస వైపే ఉన్నారని రాష్ట్రంలో రాష్ట్రంలో బారాస ప్రభుత్వం(BRS Govt) రావడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. మండల పరిధిలోని చౌదర్పల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల్లో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని మండిపడ్డారు. పట్టబదులంద ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ సీన్లు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పుట్టరాంరెడ్డి, నాగులు నాయక్, అనిల్ కుమార్, అంజి మాస్టర్, వెంకట్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.