మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం

23-11-2026 | 05:57pm

చేగుంట నవంబర్ 23, విజయక్రాంతి: చేగుంట మండల  వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee ) కార్యాలయంలో సోమవారం  వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం చైర్మన్ తాడెం వెంగల్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్ వెస్లీ గత 3 నెలలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను పాలకవర్గం సభ్యులకు చదివి వినిపించారు.అనంతరం సభ్యులందరూ అభివృద్ధి పనులు, పలు అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి సంతకాలు చేశారు. 

అనంతరం వారు మాట్లాడుతూ మార్కెట్ కార్యాలయంలో సీసీ రోడ్డు, వాటర్ ప్లాంట్, షేడ్, బాత్రూం గురించి   అభివృద్ధి కార్యక్రమ లకు తీర్మానం చేసి నట్లు తెలిపారు,ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సిములు, అన్నం ఆంజనేయులు, , మొహమ్మద్ రఫీ, ఫకీర్ నాయక్, శ్రీధర్ రెడ్డి, బాల్ రెడ్డి,రమేష్ గుప్తా , తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు