మిత్రుల కుటుంబాలకు చేయూత....

22-10-2026 | 07:55pm

ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన 1992–1993 బ్యాచ్ పూర్వ విద్యార్థులు

శివ్వంపేట, అక్టోబర్ 22(విజయక్రాంతి ): ఆపదలో ఉన్న మిత్రుల కుటుంబాలకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు 1992–1993 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు(Alumni). తమ బ్యాచ్‌కు చెందిన మిత్రులు మరణించడంతో వారి కుటుంబాలకు, ప్రమాదానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో మిత్రుడికి ఆర్థిక సహాయం అందించి ఆదర్శంగా నిలిచారు.

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన గుండ నర్సింలు గత ఆగస్టు 19న గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన పూర్వ విద్యార్థి మిత్రులు నర్సింలు భార్య గుండ పద్మ, కుమారుడు గుండ యశ్వంత్‌ను పరామర్శించి, వారి కుటుంబానికి రూ.60,000 ఆర్థిక సహాయం అందించారు.

అదే గ్రామానికి చెందిన చేత్రి నగేష్ నెల రోజుల క్రితం బైక్ ప్రమాదానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్న నగేష్ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని తెలుసుకున్న మిత్రులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.25,000 ఆర్థిక సహాయం అందజేశారు.

మొత్తంగా రెండు కుటుంబాలకు కలిపి రూ.85,000 ఆర్థిక సహాయం అందించి తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు. కష్టకాలంలో మిత్రుల కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎం. నవీన్‌తో పాటు బ్రహ్మానంద రెడ్డి, బాణపురం శంకర్, రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనారాయణ, బల్ సింగ్, రవి, రవీందర్, రామకృష్ణ రెడ్డి, కిరణ్ కుమార్, శివాజీ, నగేష్, కృష్ణ రెడ్డి, సుధాకర్ రెడ్డి, షరీఫ్, రామ రెడ్డి, తాహిర్ అలీ, సురేందర్ రెడ్డి, బల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు