గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు

27-10-2026 | 04:00pm
  1. నగ్నంగా క్షుద్ర  పూజలు, వీడియో కాల్ లో తాంత్రిక పూజారి 
  2. సర్పంచ్ భర్త, కుమారుడి తో పాటు మరి కొంత మంది 
  3. పట్టుకొని చితకబాధిన గ్రామస్తులు
  4. సర్పంచ్ భర్త మహేందర్, తో పాటు ఏడుగురి పై కేసు నమోదు చేసిన ఎస్ ఐ శివానందం

శంకరంపేట్,/చేగుంట అక్టోబర్ 27: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు(Black Magic Rituals) గ్రామం లో కలకలం లేపాయి , విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న 9 మంది వ్యక్తులకు పట్టుకొని దేహ శుద్ధి చేసి చిన్న శంకరంపేట్ పోలీసులకు అప్పగింంచిన గ్రామస్తులు,

ఎస్ఐ శివానందం వివరాల ప్రకారం  శంకరంపేట్ మండలం లోని సూరారం గ్రామ వ్యవసాయ క్షేత్రంలో వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామ సర్పంచ్ భర్త మహేందర్,అతని కుమారుడు, మరి కొంత మంది క్షుద్ర పూజలు చేస్తుండగా గ్రామస్తులు పట్టుకొని పోలీసుల అప్పగించారు, క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 

నగ్నంగా క్షుద్ర పూజలు వీడియో కాల్ లో తాంత్రిక పూజారి

సూరారం గ్రామానికి చెందిన గ్రామస్తులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోమవారం రాత్రి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో టాటాఏసి వ్యాన్ లో వచ్చి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని, అందులో కొంతమంది క్షుద్ర పూజలను నగ్నంగా చేస్తున్నారని, కానీ తాంత్రిక పూజారి మాత్రం ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా ఆ కార్యక్రమం ఆ కార్యక్రమం నిర్వహించారని గ్రామస్తులు ఆరోపించారు, నగ్నంగా పూజలు చేయడానికి గమనించిన తర్వాతే  చితకబాధి పోలీసులకు అప్పగించామని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు